ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ లో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ నిరాకరణ

national |  Suryaa Desk  | Published : Tue, Apr 26, 2022, 04:36 PM

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిరాకరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారి ప్రతినిథి రణదీప్ సుర్జెవాలా తెలిపారు. ప్రశాంత్ కిషోర్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని రణదీప్ సుర్జెవాలా తెలిపారు. 


పీకే ను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ కమిటీ నివేదిక ఇవ్వగా, ప్రశాంత్ కిషోర్ ను సోనియా పార్టీలోకి ఆహ్వానించారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనను తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీకి సలహాదారునిగా మాత్రమే కొనసాగాలని నిర్ణయించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com