మహిళలు ఎక్కువగా రక్త హీనత సమస్యతో బాధపడుతుంటారు. శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోతే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే చాలమంది తమలో ఈ సమస్య ఉన్నట్టు కూడా గుర్తించలేరు. రక్తహీనత వల్ల బ్రీతింగ్ సరిగ్గా అందదు. దీంతో తొందరగా నీరసపడిపోతారు. కండరాలు బలహీనం అయిపోతాయి. కొన్ని సందర్భాల్లో గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. సాధారణంగా మహిళల శరీరంలో 12 శాతం నుంచి 15.5 శాతం హిమోగ్లోబిన్ ఉండాలి.. కానీ చాలా మంది మహిళల్లో ఆ స్థాయిలో ఉండడం లేదు. ఒక్కొక్కరికి 6 శాతానికి 5 శాతానికి హిమోగ్లోబిన్ స్థాయి పడిపోయిన మహిళలు ఉన్నారు. శరీరంలో తగిన స్థాయిలో ఐరన్ లేకపోవడం వల్లే ఈ సమస్య వసతుంది.
ఒంట్లో ఐరన్ తక్కువగా ఉంటే అలసట, తలనొప్పి, మైకం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, గుండే దడ, జుట్టు రాలడం లాంటి లక్షణాలు ఉంటాయి. కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ చేసుకోవడం వల్ల రక్తంలోని హిమో గ్లోబిన్ స్థానికి తెలుసుకోవచ్చు. ఈ సమస్యను అధిగమనించాలంటే తగినస్థాయిలో ఐరన్ ఉన్న ఫుడ్‌ను తీసుకోవాలి. నిత్యం తీసుకునే ఆహార పదార్ధాల్లో ఐరన్ శాతాన్ని పెంచే వాటిని తీసుకుంటూ ఉండాలి. ఐరన్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను పుష్కలంగా తినాలి. విటమిన్-సీ సమృద్ధిగా దొరికే ఆహారాన్ని తీసుకోవాలి. బియ్యం, గోధుమలు, డబుల్ పోర్టీఫైడ్ సాల్ట్, బలవర్ధకమైన ఆహారాన్ని తినడం ద్వారా ఐరన్ డిఫెషియన్సీని అరికట్టవచ్చు.