మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చే ఎంఐజీ ప్రాజెక్టును ప్రారంభించడానికి నేడు సీఎం జగన్ విశాఖపట్నం వెళ్తున్నారు అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విశాఖకు చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చెయ్యబడిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైయస్‌ఆర్ పార్కులో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించి, నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తదుపరి సభా ప్రాంగణానికి చేరుకొంటుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa