జగన్ రెడ్డి రివర్స్ పాలన లో బాధితుల పైనే కేసులు, వేధింపులు.. గుడివాడ మండలంలోని మోటూరు గ్రామంలో మట్టి అక్రమ రవాణాని అడ్డుకున్నారనే అక్కసుతో దాడికి పాల్పడటమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఆర్ ఐ అరవింద్ పై అర్ధరాత్రి లంచం డిమాండ్ చేసారని కేసు పెట్టడం వైసిపి మైనింగ్ మాఫియా అరాచకాలకు అద్దంపడుతుంది అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ అన్నారు. ఈ సంఘటన ఆధారంగా ఆయన మాట్లాడుతూ.. వైసిపి నాయకుల ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా పనిచేసే అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతియ్యడమే లక్ష్యంగా ఇటువంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అధికారులను బెదిరించడానికి పెడుతున్న అక్రమ కేసుల విషయంలో మరోసారి కోర్టులో ప్రభుత్వం మొట్టికాయలు తినడం ఖాయం. వైసిపి నిరంకుశ పాలన, అక్రమాలకు ఎదురొడ్డి పోరాడుతున్న ఉద్యోగస్తులకు ఎప్పుడూ మా మద్దతు ఉంటుంది అని తెలిపారు. నిజానికి ఆర్ ఐ అరవింద్ మట్టి అక్రమ రవాణాని అడ్డుకోవడం వాస్తవం, అందుకు అక్కడ నిర్వాహుకులు అరవింద్ మీద చేయీ చేసుకోవడం కూడా ప్రత్యక్షంగా వీడియో కూడా బయటికి వచ్చింది. కానీ ఇలాంటి కేసులు బనాయించడం అనేది సరైన పద్దతి కాదేమో అని కొంతమంది రాజకీయ నిపుణులు కూడా వాపోతున్నారు.