మీ ఇంట్లోకి ఎయిర్ కూలర్ కొనాలనుకుంటున్నారా? అయితే ఎయిర్ కూలర్ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మీ రూమ్ సైజ్, వాటర్ ట్యాంక్ కెపాసిటీ, పవర్ ఎంత ఖర్చవుతుంది అన్న అంశాలు తెలుసుకుంటేనే మీరు సరైన ఎయిర్ కూలర్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఆఫర్ బాగుందనో, ఎవరో చెప్పారనో కూలర్ కొంటే తర్వాత మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే మీరు ఎయిర్ కూలర్ కొనడానికి వెళ్లే ముందు ఈ టిప్స్ గుర్తుంచుకోండి. ఎయిర్ కూలర్‌లో రెండు రకాలుంటాయి. ఒకటి పర్సనల్ కూలర్. రెండోది డిసర్ట్ కూలర్. మీ రూమ్ చిన్నగా లేదా మీడియం సైజ్‌లో ఉంటే పర్సనల్ కూలర్ చాలు. అంటే రూమ్ 200 నుంచి 300 స్క్వేర్ ఫీట్ ఉంటే పర్సనల్ కూలర్ సరిపోతుంది. ఒకవేళ రూమ్ అంతకన్నా పెద్దగా ఉంటే డిసర్ట్ కూలర్ ఎంచుకోవాలి. ఇక వాటర్ కెపాసిటీ కూడా ముఖ్యమే. ఇది కూడా మీ రూమ్ సైజ్‌పై ఆధారపడి ఉంటుంది. చిన్న గది అయితే 15 నుంచి 25 లీటర్లు, మీడియం సైజ్ గది అయితే 25 నుంచి 40 లీటర్లు, పెద్ద గది అయితే 40 లీటర్ల కన్నా ఎక్కువ వాటర్ కెపాసిటీ ఉన్న కూలర్ సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని కూలర్లలో ఆటో ఫిల్ ఆప్షన్ ఉంటుంది. నీళ్లు ఖాళీ కాగానే ఆటోమెటిక్‌గా ఫిల్ అవుతుంది. ఫాస్ట్ కూలింగ్ కోసం కొన్ని కూలర్స్‌లో ఐస్ ఛాంబర్స్ ఉంటాయి. అందులో మీరు ఐస్ క్యూబ్స్ వేస్తే ట్యాంక్ త్వరగా కూల్ అవుతుంది.