బాగా వేడిగా, చెమట పట్టే వాతావరణంలో హీట్ రాష్ మొదలవుతుంది. చెమట వల్ల ఏర్పడే బ్యాక్టీరియా, డెడ్ స్కిన్ సెల్స్ కలిసి చేమట గ్రంధులని మూసేస్తాయి. ఫలితంగా చెమట చర్మం లోపలే ట్రాప్ అయిపోతుంది. ఇది ఒక్కసారి బర్స్ట్ అయినప్పుడు పొడుస్తున్న ఫీలింగ్ ఉంటుంది, అందుకే ప్రిక్లీ హీట్ అనే పేరు వచ్చింది. ఈ ప్రిక్లీ హీట్ ని ప్రివెంట్ చేయడానికి ఇలా చేయవచ్చు.
గాలి తగిలే బట్టలు వేసుకోండి : ఈ విషయంలో గోల్డెన్ రూల్ ఏమిటంటే మీ బాడీని కూల్‌గా, బాగా గాలి తగిలేట్లుగా ఉంచుకోవడం. మీకు చెమట కాయలు ఉన్న చోట దుస్తులు పక్కకి తప్పించి చల్లని గాలికి ఆ ప్రదేశాన్ని ఎక్స్పోజ్ చేయండి. ఇలా చేయడం వల్ల స్కిన్ కి రిలీఫ్ లభిస్తుంది.
హైడ్రేటెడ్‌గా ఉండండి: వేడి గాలు, ఎండలు శరీరం లోని శక్తిని పీల్చేస్తాయి. అందుకనే మీరు హైడ్రేటెడ్ గా ఉండడం ఎంతో అవసరం. మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు వంటి నాచురల్ కూలర్స్ తీసుకోండి. ఏరేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ ఎవాయిడ్ చేయడానికి చూడండి. మీ డైట్ లో ఫ్లేవర్డ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందు వల్ల మీకు సీజనల్ ఫ్రూట్స్, హెర్బ్స్ యొక్క ఫుల్ బెనిఫిట్స్ లభిస్తాయి.
హెల్దీ ఫుడ్స్ తీసుకోండి: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల సమ్మర్ హీట్ ని బీట్ చేయగలరు. సలాడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వంటివి ఎక్కువగా తీసుకోండి. వేపుళ్ళు, స్వీట్స్ వీలున్నంత ఎవాయిడ్ చేయండి. అలాగే, శరీరం లో వేడిని పెంచే మసాలాల వాడకం కూడావ్ కుదిరినంతగా తగ్గించండి.
పెరుగు చర్మాన్ని బాగా చల్లబరుస్తుంది. మీకు చెమట కాయలు ఉన్న ప్రదేశం లో చల్లని పెరుగుని అప్లై చేసి పదిహేను నిమిషాలు ఉంచండి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేసి మెత్తగా అద్దండి. పెరుగులో సహజంగానే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవి యాక్నే రాకుండా అడ్డుకుంటాయి. మీ స్కిన్ ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండేలా చేస్తాయి. చెమట కాయలకి గంధం వాడడం మనకి ఎప్పటి నుండోనే తెలుసు. గంధానికి చల్లని ఫుల్ ఫ్యాట్ మిల్క్ కలిపి ఆ మిశ్రమాన్ని చెమట కాయలు ఉన్న ప్రదేశం లో పట్టించి గాలికి ఆరనివ్వండి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేయండి. గంధం లో ఉండే నాచురల్ ఆయిల్స్ సన్ ట్యాన్ ని పోగొట్టుకోవడానికి కూడా హెల్ప్ చేస్తాయి.