మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం లో గురువారం వాటర్ లైన్ ల డిస్టిబ్యూషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ శారదా దేవి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఏఐబీ లో భాగంగా మంగళగిరి - తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో మొత్తం 230 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించటానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. ప్యాకేజీ 1 క్రింద సుమారు 170 కోట్ల రూపాయలతో ఓహెచ్ఆర్ఎస్ మరియు మెయిన్ పంపింగ్ స్కీమ్ పనులను ప్రారంభించడం జరిగిందని. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో సుమారు 50 కోట్ల రూపాయలతో వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్ లను ఏర్పాటు చేయటానికి పనులను మే 15 లోపు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.
కార్పొరేషన్ పరిధిలో సుమారు 15 వేల ఇళ్ల కు 160 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు, వీటికి 7 సంవత్సరాల మెయింటినెన్స్ మొత్తం కాంట్రాక్టర్ చేస్తారని అన్నారు. అలానే కార్పొరేషన్ లో ప్రతి ఇంటికి 24 గంటలు త్రాగునీరు సరఫరా చేయాలన్న సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు కాంట్రాక్టర్ తో కలిసి పని చేస్తామని అన్నారు. ఈ పనులను జోన్లుగా విభజించి ప్రారంభించడం జరుగుతుందని మంగళగిరి తాడేపల్లి కలిపి మొత్తం 16 జోన్లుగా ఏర్పాటు చేయడం జరిగిందని ముందుగా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.