బ్రెజిల్ దేశానికి చెందిన ఆర్థుర్ ఓ ఉర్సో అనే మోడల్ కి తొమ్మిది మంది భార్యలున్నారు. ఒకేసారి 9 మంది భార్యలతో కలిసి జీవించడం కష్టం కాబట్టి అతను ఓ వింత పరిష్కార మార్గం కనుగొన్నాడు. ఏ రోజు ఎవరితో గడపాలో నిర్ణయించేందుకు ఓ టైమ్ టేబుల్ ని రూపొందించాడు. మొదట్లో ఆ టైమ్ టేబుల్ బాగానే ఉందనిపించినా, తన ఫీలింగ్స్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా టైమ్‌టేబుల్‌లో ఉన్న భార్యతో గడపడం ఆర్థుర్ కు నచ్చలేదు. దీంతో ఆ విధానాన్ని పక్కన పెట్టేశాడు. ఆర్థుర్ మొదట లువానా కజకిని మాత్రమే పెళ్లి చేసుకున్నాడు. అయితే గతేడాది ఏకంగా మరో 8 మందిని వివాహం చేసుకున్నాడు. ఏకపత్నీవ్రతంపై నిరసన తెలపడమే తన ఉద్దేశమంటూ అతను వార్తల్లోకి ఎక్కాడు.
ఎవరితో ఎక్కువ సమయం గడిపాననే విషయాన్ని తన భార్యలు పెద్దగా పట్టించుకోరని ఆర్థుర్ చెబుతున్నాడు. అయితే ఎవరికైనా ఖరీదైన గిఫ్టులు ఇస్తే మాత్రం మిగతా వారితో ఇబ్బంది పడాల్సి వస్తుందట. ఈ మందిలో ఓ భార్య మాత్రం ఆర్థుర్ పూర్తిగా తనతోనే ఉండాలని ఆశపడుతోంది. ఇదే విషయంపై వారి మధ్య గొడవ కూడా జరిగింది. ఈ వ్యవహారం విడాకుల వరకు వెళ్లింది. ప్రస్తుతానికి వీరు కలిసే ఉన్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.