వేసవి కాలం మొదలయ్యిందంటే చాలు రాత్రి పూట ఏసీ వేసుకుని పడుకుంటేనే కానీ నిద్ర పట్టదు. వేసవిలో పగలంతా ఇళ్ళు ఓ మోస్తరు చల్లదనంగా ఉన్నా రాత్రి పూట ఆవిరి వస్తుంది. దీంతో ఏసీ వేసుకుని నిద్రపోతాం. ఇదివరకు కొన్ని ఉన్నతవర్గ కుటుంబాలలో ఉండే ఏసీ EMI ల పుణ్యమా అని ఇప్పుడు మధ్యతరగతి ఇళ్లల్లో కూడా దర్శనమిస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈ రోజుల్లో ఏసీ కనీస అవసరం గా మారిపోయింది. అయితే రాత్రంతా ఏసీలో నిద్ర పోవటం వల్ల కరెంటు బిల్లు కూడా భారీగానే వస్తుంది. ఇది కాకుండా ఏసీ వల్ల ఆరోగ్యానికి కూడా ఇబ్బంది ఉంది. అదేంటంటే... ఎక్కువసేపు ఏసీ లో నిద్ర పోవటం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదంట. దానివల్ల చర్మం పొడిబారిపోయి వదులుగా మారుతుంది. అంతేకాక కళ్ల మంటలు, దురద, తలనొప్పి, మైగ్రైన్ వంటి అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తుంది. సో... ఏసీ వేసుకోండి కానీ ఎక్కువసేపు కాదు. గది చల్లబడిన తర్వాత ఆఫ్ చెయ్యండి. ఇలా చెయ్యటం వల్ల కరెంటు ఆదా అవుతుంది, ఆరోగ్యం కులాసాగా ఉంటుంది.