రాష్ట్రాలలో అవలంభించాల్సిన విధానాలు, ప్రజలకి మేలు కలిగేలా చెయ్యవలసిన పనులు, ప్రకృతి నుండి వెలువడే విపత్తులను ఎలా ఎదుర్కోవాలి, న్యాయ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుందా.. లేదా...?, ప్రస్తుతం దేశం లోని ప్రతి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మొదలైన వాటి మీద చర్చలు చెయ్యడానికి సంవత్సరానికి ఒకసారి లేదా అవసరాన్ని బట్టి ఆ సమయంలో కొన్ని సదస్సులు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగే అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్‌లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో పాల్గొంటారు. సదస్సును ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రారంభిస్తారు. తెలంగాణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రాలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈ క్రమంలోనే నేడు దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరుగుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.