ఎక్కువగా తినప్పుడు జీర్ణవ్యవస్థపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో ఆహార వ్యవస్థలో యాడిడ్ పైకి ప్రవహిచండం ప్రారంభమవుతుంది. అదే సమయంలో అసిడిటి సమస్య వేధిస్తుంటుంది. అందుకే ఆహారాన్ని ఒకేసారి తినకుండా కొంచెం కొంచెం తినాలి. ఎక్కువగా తినకూడదు. ప్రతి సారి తక్కువ మోతాదులో తినాలి. కాఫీ, టీ ఎక్కువగా తాగుతుంటే.. మీరు ఆ అలవాటును మార్చుకోవడం మంచిది. దీనివలన యాసిడ్ రిఫ్లక్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. కాఫీ తాగినప్పుడు కడుపులో యాసిడ్ పెరుగుతుంది. అలాగే అది అన్నవాహికలోకి ప్రవహిస్తుంది. కాఫీలోని కెఫిన్ మీ ఎసోఫాగియల్ స్పింక్టర్ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.
సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. దీనివలన జీర్ణవ్యవస్థపై ఎక్కువగా ప్రభావం పడదు. అలాగే యాసిడ్ రిఫ్లక్స్ పనితీరు వేగవంతం అవుతుంది. అసిడిటి, కడుపులో మంటగా అనిపించినప్పుడు రెండు ఏలకులు తినాలి. దీంతో తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. అసిడిటీ సమస్యను తగ్గించడంలో తులసి ఆకులు ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఇవి అసిటిడీని తొలగించడమే కాకుండా మానసకి, అనేక శారీరక వ్యాధులను కూడా దూరం చేస్తాయి. అసిడిటీని తగ్గించడానికి తులసి ఆకుల కషాయాన్ని కూడా తీసుకోవచ్చు. పుదీనా ఆకులు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. మసాలా ఆహారాన్ని తిన్న తర్వాత పుదీనా ఆకులను నమలాలి. దీనివలన అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా, ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే ఉపశమనం లభిస్తుంది.