రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి పక్షాలు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి. ఒకపక్క పన్నులు, కరెంటు కోతలతో ఇబ్బంది పడుతుంటే, మరో పక్క హత్యాచారాలు , హత్యలతో రాష్ట్రమంతటా అలజడి లో పడుతుంది. నిజానికి చెప్పాలంటే ప్రజలు భయాందోళనలో బ్రతుకుతున్నారు. రోజు ఏదో ఒక భయంకరమైన వార్త వినాల్సి వస్తుంది. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ... వరుస ఘటనలతో రాష్ట్ర ప్రజలంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో భయాందోళనకు గురవుతున్నారు శాంతిభద్రతల పర్యావేక్షణ మంత్రి చేతిలోనే ఉందా? లేక సలహదారుల ప్రాణాళికలద్వారానే పాలన సాగుతుందా ముఖ్యమంత్రి జగన్ గారు? అని ప్రశ్నించారు.