చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం జాకు కొత్తూకు చెందిన రమణ టైల్స్ వేసే పనిచేసి జీవనం సాగించేవాడు. భార్య ఉమ , పిల్లల మేఘన ( 12 ) , యోగప్రియ ( 11 ) ఉన్నారు. వారు మదనపల్లె రూరల్ ఎగువకురవంక ప్రాంతంలోని విజయనగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. తరచూ మద్యం తాగి ఇంటికి వస్తుండటంతో భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. భార్య కాపురానికి రాలేదని మనస్తాపానికి గురైన రమణ ఇంటి పక్కనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.