అనేక పోరాటాలతోనే కార్మిక చట్టాలు ఏర్పడ్డాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ టీ రాజారావు అన్నారు. పొన్నూరులో ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు జరిగాయి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మేడే జిందాబాద్. అంటూ కార్మిక సంఘాలు పట్టణంలో బైక్, ఆటో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని జిబిసి రోడ్డులో మేడే సందర్భంగా జెండాను ప్రముఖ పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ టీ రాజారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు చేసిన ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మిక చట్టాలు ఏర్పడ్డాయని వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంతో పాటు ముఖ్యంగా కార్మికులపై ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాంత్రీకరణ పేరుతో కార్మిక చట్టాలను, కార్మికులను ఇబ్బంది గురిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి తమ చట్టాలను పరిరక్షించుకోవాలని సూచించారు.