ఆంధ్రప్రదేశ్ లో ఎడాపెడా విద్యుత్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు పరీక్షల సమయం కావడంతో విద్యార్దులు చదువుకోలేకపోతున్నారు. చాలా ప్రాంతాల్లో పగటి వేళ అసలు విద్యుత్ ఉండడం లేదు. మరో వైపు రాత్రి వేళల్లో ఇష్టా రాజ్యంగా విద్యుత్ కోతలను విధిస్తున్నారు. దీని పై విద్యుత్ అధికారులను అడిగినా స్పందన లేదని శ్రీకాకుళం జిల్లా వాసులు తెలుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గుజరాతీపేట ప్రాంతానికి వరుసగా మూడు రోజులు రాత్రిపూట విద్యుత్ సరఫరా కాలేదు. దీని పై ప్రశ్నించినా పట్టించుకునే వారే లేరన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, వెంటనే ప్రభుత్వం విద్యుత్ కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.