ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఆహారంతో చర్మంపై ముడతలకు చెక్!

Life style |  Suryaa Desk  | Published : Sun, May 08, 2022, 09:08 AM

కాంప్లెక్స్​ కార్బోహైడ్రేట్స్​ ఉండే దంపుడు బియ్యం, సజ్జలు, జొన్నలు, బ్రౌన్​ రైస్​ వంటి పదార్థాలను తింటే చర్మంపై ముడతలు త్వరగా రావని నిపుణులు చెబుతున్నారు.
తృణధాన్యాల్లో ఫైబర్​, విటమిన్స్​, ప్రోటీన్స్​, మినరల్స్​ సహా వివిధ రకాల ఫైటో మినరల్స్​ ఎక్కువగా ఉంటాయి.
బీన్స్​ లో పిండి పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఫ్యాట్స్​, ప్రోటీన్లు ఉంటాయి. శరీరానికి కావాల్సిన 9 అమేనో ఆమ్లాలలో 8 వీటిలోనే ఉంటాయి.
పొద్దుతిరుగుడు, గుమ్మడి, అవిసె గింజల్లో విటమిన్​-ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
డ్రైఫ్రూట్స్​, పల్లీలు, అత్తిపండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
శాకాహారులు అయితే పప్పులు, చిక్కుడు, పన్నీర్​, టోఫోలు ఎక్కువగా తినాలి.
మాంసాహారులు అయితే గుడ్లు, సాల్మన్​ ఫిష్ ​ను తీసుకోవాలి. సాల్మన్​ ఫిష్​ను వారానికి ఒక్కసారి తినడం వల్ల వయసు పైబడనివ్వకుండా కాపాడుతుంది.
యాంటీఆక్సిడెంట్స్​ ఎక్కువగా ఉండే ఆలివ్​ ఆయిల్​ తీసుకుంటే చర్మానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com