ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. కీలక పదవుల్లో ఉన్న అధికారులకు శాఖలను కేటాయింపును మార్చారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న జవహర్ రెడ్డిని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా సత్యానారాయణను నియమించారు. యువజన సర్వీసుల శాఖ కమిషనర్ నాగరాణిని ప్రభుత్వం రిలీవ్ చేసి, ఆ స్థానంలో శారదా దేవి నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఇంతియాజ్‌కు కూడా స్థాన చలనం తప్పలేదు. ఆయనను సెర్ప్ సీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలను ఏపీ సర్కారు నియమించింది.