రాంచీ విమానాశ్రయంలో దివ్యాంగ బాలుడిని బోర్డింగ్‌కు నిరాకరించిన ఇండిగో విమాన సిబ్బంది తీరుపై భారతదేశ విమానయాన నియంత్రణ సంస్థ సీరియస్ అయ్యింది. దీనిపై విచారణ చేపట్టాలని త్రి సభ్య బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం రాంచీ, హైదరాబాద్ విమానాశ్రయాలకు వెళ్లి విచారించనుంది. దివ్యాంగ బాలుడితో శనివారం హైదరాబాద్‌కు బయలుదేరిన కుటుంబాన్ని ఇండిగో విమాన సిబ్బంది నిరాకరించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa