ఐపీఎల్-2022 సీజన్‌లో కొత్తగా అడుగు పెట్టిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో జట్టుపై గుజరాత్ టైటాన్స్ జట్టు 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 13.5 ఓవర్లలో 82 పరుగులతో ఆలౌట్ అయింది.లక్నో బ్యాట్స్‌మెన్‌లలో దీపక్ హుడా 27 పరుగులు చేశాడు.గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లు యశ్ దయాల్ 2, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ 2, షమీ 1 వికెట్లు తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa