మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఉరుకులు, పరుగులతో ఇంటి పని, పిల్లల పని, ఆఫీసులో పనులు నిర్వహిస్తుంటారు. ఇన్ని పనులు చేయడానికి అదనపు శక్తి ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అయితే చాలామంది ఆడవాళ్లు.. తమ తమ ఆరోగ్యాలపై దృష్టి సారించరు. అయితే చిన్న చిన్న చిట్కాలతో ఆరోగ్యంపై కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త పడితే.. జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. ప్రతిరోజూ పరగడుపున ఒక లీటరు నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. దాంతోపాటు భోజనంలో పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. దాంతో జీర్ణ సమస్యలు దూరం చేసుకోవచ్చు. గ్యాస్ ప్రాబ్లమ్ ఉత్పన్నం అవ్వదు. . పావు టీ స్పూన్ యాలకుల పొడిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే వాంతులు, వికారం తగ్గుతాయి.
అలాగే పచ్చి పసుపు, పాల మీగడ కలిపి ముఖానికి రాసి 20 నిమిషాలు తర్వాత స్నానం చేస్తే చర్మం నిగనిగలాడుతుంది. అర చేతులు గట్టిపడితే ఒక టీ స్పూన్ చక్కెర అదే మోతాదులో ఆయిల్ కలిపి రెండు చేతులు మర్థనా చేయాలి. దాంతో అరచేతులు మృదువుగా మారతాయి. ఎర్రచందనం పొడిలో కొబ్బరి పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది. అదేవిధంగా సన్ స్ర్కీన్ లోషన్ కొనేటప్పడు ప్యాక్ మీద సన్ ఫ్రొటెక్షన్ ఫ్యాక్టర్ 15 శాతం ఉండేలా జాగ్రత్త పడాలి. అదేవిధంగా మెంతికూరను కొన్ని రోజులు క్రమం తప్పకుండా తింటే నెలసరి క్రమబద్ధం అవుతుంది. అన్నం మొదటి ముద్దలో నువ్వుల పొడి ఒక చెంచా కలుపుకుని తినడం వల్ల హార్మోన్లు బ్యాలెన్సింగ్‌గా ఉంటాయి. పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడే మహిళలు రెండుసార్లు పలచటి నిమ్మరసం తాగితే ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకులు లేదా తులసి టీ తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ నుంచి కాపాడుతుంది.