ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్రతుపాన్.. బలహీనపడి తుపాన్‌గా మారింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. హంసలదీవి వద్ద సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. హంసలదీవి బీచ్ గేట్లను మెరైన్ పోలీసులు మూసివేశారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో కంట్రోల్ రూంలను రెవిన్యూ అధికారులు ఏర్పాటు చేశారు.
మచిలీపట్నం సహా పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. మచిలీపట్నం వద్ద సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. ఐదు మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి.