ఏపీలోని కృష్ణా, గుంటూరు, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మచిలీపట్నానికి పశ్చిమంగా కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. కాసేపట్లో తీవ్ర వాయుగుండం బలహీనపడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం కదులుతున్న ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 65 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఇప్పటికే ప్రకటించిన రెడ్ అలెర్ట్ ను అధికారులు కొనసాగిస్తున్నారు.