ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూతురి కోసం మగాడిలా మారిన తల్లి

national |  Suryaa Desk  | Published : Thu, May 12, 2022, 12:08 PM

ఓ తల్లి తన కూతురి కోసం ఏకంగా 30 ఏళ్ల పాటు మగాడిలా బతికింది. పురుషుడి వేషధారణలో పెయింటింగ్, టీ మాస్టార్, వంట మనిషిగా పనులు చేసింది. ఆమెనే తమిళనాడుకు చెందిన పెచ్చియామ్మాల్​. పెళ్లైన కొన్ని రోజులకే భర్త చనిపోవడంతో ఎన్నో తప్పుడు చూపులు ఆమె వెంటపడేవి. వేధించేవి. అంతలోనే ఆమె కూతురికి జన్మనిచ్చింది. తన కూతురిని సంరక్షించడం కోసం మగాడిలా వేషధారణ మార్చుకుంది.


పెచ్చియామ్మాల్ తన భర్త చనిపోయిన తర్వాత కడ్డునాయగన్​ పట్టికి మకాం మార్చింది. అక్కడ చిన్నచిన్న పనులు చేసుకుంటూ బతికింది. అయితే ఆమె వితంతు కావడం వల్ల పలుమార్లు లైంగిక వేధింపులను ఎదుర్కొంది. దీంతో పురుషుడిలా దుస్తులు ధరించింది. పేరు కూడా ముత్తు అని మార్చుకుంది. ప్రస్తుతం ముత్తు మాస్టర్​ కు 57 ఏళ్లు. తన కూతురికి వివాహం చేసేసింది. తన జీవితం పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని చెబుతోంది. ఆధార్​ కార్డులో కూడా తన పేరు ముత్తు అనే ఉంటుందని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com