గన్నవరం రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో కొంత మంది వ్యక్తులు నయా దాందాకు పాల్పడుతున్నారు. రిజిస్ట్రేషన్లు చెపిస్తాం రిజిస్ట్రేషన్ చేపిస్తాం అంటూ బయలుదేరతారు. వీరికి నిరక్షరాస్యులే ఆయుధం లోన్లు ఇప్పిస్తాము అనే పేరుతో వచ్చిన వాళ్ల దగ్గర అందినంత దోసుకుంటారు. లోన్లకు సెక్యూరిటీగా పెట్టే స్థలం కొలిపించటానికి మండల సర్వేరును పంపిస్తామని, ప్రైవేటు వ్యక్తులను పంపించి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. లోన్లు కావాలంటే గతంలో చేసిన రిజిస్టేషన్ లు తప్పని, వాటిని మరలా చేయాలని హుకుం జారీ చేస్తారు. ఎవరైనా ఏదైనా సమస్య ఉందని వస్తే వారి దగ్గర్నుంచి ఫీజులు వసూలు చేస్తున్న వైనం. ఎవరైనా ఎందుకు ఏంటి అని ప్రశ్నిస్తే భయపెడుతున్న ధోరణితో తనతో మాట్లాడటం ప్రభుత్వం మాది అధికారుల మా వారు అంటూ బెదిరిస్తున్న వైనం. వీరికి ఎస్సీ ఎస్టీ బిసి నిరక్షరాస్యులే పెట్టుబడి.