కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విశాఖపట్నం రైలు ను ఎక్స్ ప్రెస్ రైలు గా రావడానికి కృషిచేసిన మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నం న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ గురువారం కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎంతో కాలంగా విశాఖపట్నంకి రైలు లేకపోవడంవల్ల విద్యార్థులు, గోల్డ్ కవరింగ్ వ్యాపారస్తులు, శ్రీకాకుళం నుండి వచ్చే వలస కూలీలు, పలు ఇబ్బందులకు గురవుతున్నారని, అన్నవరం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ విషయంపై స్పందించవలసిందిగా ప్రజల కోరిక మేరకు వల్లభనేని బాలశౌరి చేసిన కృషి అభినందనీయమని బాలాజీ అన్నారు.
మచిలీపట్నం అభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా నాయకులు పని చేయాల్సిన అవసరం ఉందని బాలాజీ అన్నారు.
అదేవిధంగా తిరుపతి రైలు కూడా రెగ్యులర్ గా తిరిగే విధంగా, చర్యలు తీసుకోవాలని బాలాజీ కోరారు. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న మచిలీపట్నం ముంబై రైలు కూడా తీసుకు రావాల్సిన అవసరం ఉందని బాలాజీ అన్నారు. మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో క్యాంటీన్, బేకరీ వంటి స్టాల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని లంకి శెట్టి బాలాజీ అన్నారు.
మచిలీపట్నం బస్టాండ్ విషయంపై కూడా ఎంపీ బాలశౌరి దృష్టిసారించాలని, ముఖ్యమంత్రి నుండి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి బందరు బస్టాండ్ ను అభివృద్ధి పరచాలని కూడా బాలాజీ డిమాండ్ చేశారు.