ప్రయాణికుల సౌకర్యార్థం రోజువారీ రైలు నం. మచిలీపట్నం-విశాఖపట్నం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు ను 14 వ తేది శనివారం నుండి పునరుద్ధరించనున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ కె త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు మచిలీపట్నం-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు 21. 25 గంటలకు మచిలీపట్నం నుండి బయలుదేరి మరుసటి రోజు 08. 00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని అన్నారు. తిరుగు దిశలో విశాఖపట్నం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుండి ప్రతిరోజూ 15. వ తేథి నుండి 22. 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 09. 00 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుందని తెలిపారు. రైలు కి సంబంధించి పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ, మండవల్లి, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం, తణుకు, నిడదవోలు, గోదావరి, రాజమండ్రి, కడియం, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అనపర్తి, సామర్లకోట, అన్నకపల్లి, నలవపల్లి రోడ్డు, గొల్లప్రోలు, గొల్లప్రోలు మచిలీపట్నం-విశాఖపట్నం మధ్య దువ్వాడ తదితర ప్రాంతాల్లో స్టాపేజ్‌లు ఏర్పాటు చేశామని దాంతో పాటుగా 2వ ఏసీ-1, స్లీపర్ క్లాస్-5, జనరల్ క్లాస్-7, సెకండ్ క్లాస్ లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్-2. కంపోజిషన్ లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.