ఉలవలను తినడంవలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఉలవలు ఆకలిని పెంచుతాయి
ఉలవలు ప్లీహ వ్యాధులతో బాధపడేవారికి మేలు చేస్తాయి.
దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడి కోలుకొన్నవారు తరచూ ఉలవలను తీసుకొంటే త్వరగా జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.
ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి, గట్టిపడిన కఫాన్ని పలుచబరచటంలో ఉలవలు చక్కగా ఉపయోగపడతాయి.
అకారణంగా కన్నీరు కారటం, కళ్లల్లో పుసులు కట్టడం వంటి సమస్యలున్న వారు ఉలవలతో చేసిన అహారం తీసుకుంటే చక్కని గుణం కనిపిస్తుంది.
మూత్రంతో మంటతో ఇబ్బంది పడేవారు ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే ఉపశమనం లభిస్తుంది.
మూత్రాశయంలో రాళ్లతో బాధపడేవారు ఈ ఉలవలు తింటే త్వరలోనే రాళ్లు కరిగి కిడ్నీల పనితీరు కూడా మెరుగుపడుతుంది.
ఊబకాయానికి ఉలవలు మించిన ఔషధం లేనేలేదు.
కప్పు ఉలవలకు నాలుగు కప్పులు నీళ్లు పోసి నానబెట్టి కుక్కర్‌లో ఉడికించి, ఆ ఉలవకట్టుకు చిటికెడు ఉప్పు కలిపి ఉదయం పరగడుపునే తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు.
త్వరగా బరువు తగలనుకునేవారికి ఉలవలు మంచి సహాయకారి. ముందుగా మంచి ఉలవలను సన్నటి సెగమీద లేతగా వేయించి, చల్లారిన తరువాత పిండిపట్టుకొని రోజూ పరగడుపున రెండు చెంచాల పొడిని గ్లాసుడు నీళ్లలోకి వేసుకుని తాగితే తొందరగా బరువు తగ్గుతారు.
నెలసరి రెగ్యులర్ గా రాని మహిళలు ఉలవలను తినే ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన నెలసరి రాకపోవటం, క్రమం తప్పటం వంటి ఋతు సంబంధ సమస్యలు రావు.
ఉలవలు దెబ్బతిన్న కాలేయాన్ని కోలుకునేలా చేస్తాయి.
ఉలవల్లో ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి.
ఉలవల్లో ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి
అయితే ఈ ఉలవలు ఎక్కువగా తీసుకోవడం వలన వేడి చేసే గుణం ఉంటుంది. కనుక ఉలవలు తిన్నరోజున తగినంత మజ్జిగ కూడా తీసుకుంటే వేడి చేయదు. ఉలవలను నేరుగా తినేదాని కంటే ఉడికించి, మొలకలెత్తించి లేదా వేయించి పొట్టు తీసితిన్నప్పుడు పోషకాల విలువ మరింత పెరుగుతుంది. ఇక వీటిని ఉలవలను కనీసం 8 గంటల పాటు నానబెడితేనే పూర్తిగా నానతాయి.