కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. పలు కంపెనీలు కూడా ఇప్పటికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటూ తమ ఉద్యోగులకు ఆదేశాలిచ్చింది. అయితే తాజాగా ఓ కంపెనీ తన ఉద్యోగులను ఆఫీసుకు రావాలంటూ కోరింది. దీంతో ఆఫీసుకు రాలేమంటూ ఏకంగా 800 మంది ఉద్యోగులు రాజీనామా ఇచ్చారు. గత రెండు నెలల్లో ముంబైకి చెందిన కోడింగ్ లెర్నింగ్ స్టార్టప్ కంపెనీ ‘వైట్‌హ్యాట్ జూనియర్’కు చెందిన 800 మంది ఉద్యోగులు ఈ విధంగానే రాజీనామా చేసినట్లు యాజమాన్యం తెలిసింది.
ఐఎన్‌సీ42 ప్రత్యేక నివేదిక ప్రకారం.. వైట్‌హ్యాట్ జేఆర్‌ను ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్ 2020లో 300 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. కోవిడ్-19 తగ్గుముఖం పట్టడంతో నెల రోజుల్లోపు ఉద్యోగులంతా ముంబయి, బెంగళూరు, గురుగ్రామ్ ఆఫీసులకు వచ్చి పనిచేయాలని కంపెనీ కోరింది. దీనికి సంబంధించి ఉద్యోగులకు మార్చి 18న ఈ-మెయిల్ కూడా పంపింది. అయితే కార్యాలయాలకు వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగులు ఇప్పట్లో రాలేమని, 800 మంది రాజీనామా లేఖను పంపారు. రాజీనామా చేసిన వారంతా కూడా సేల్స్, కోడింగ్, గణితం విభాగాల్లో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులేనని కంపెనీ తెలియజేసింది.