తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి కాస్తంత ముందుగానే నైరుతి రుతుపవనాలు అడుగుపెట్టబోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ నెల 15వ తేదిన తొలి వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత అవి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. ఈసారి రుతుపవనాలు ముందుగానే కేరళను తాకే అవకాశం ఉందని, అయితే మామూలుగా జూన్ 1వ తేదిన రుతుపవనాలు కేరళను తాకుతాయని, ఈసారి కాస్త ముందుగానే తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.