అసని తుపాను గాలులు వలన అవనిగడ్డ మండలం మరియు మిగిలిన మండలాల్లో ఉన్న మామిడి, అరటి, బొప్పాయి, మునగ తోటలు దెబ్బతిని రైతులు తీవ్ర నష్టం జరిగిందని జనసేన పార్టీ జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు అన్నారు. శుక్రవారం అవనిగడ్డ మండలంలో పలు పంటలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. నోటికాడికి వచ్చిన పంట నేలపాలు అయ్యి, ఎందుకు పనికిరాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మామిడి కాయలు తయారు అవ్వకముందే నేలరాలటం వలన ఎవరుకూడా కొనని పరిస్థితి, మామిడి తోటలకు పూత దశనుండి ఎన్నో పురుగులు మందులు కొట్టి కాపాడుకున్నారు ఎకరానికి 60 వేలు రూపాయలు పెట్టుబడి పెట్టినారన్నారు. ఈ తుపాను వలన నష్టపోయిన మామిడి రైతులు దిక్కుతోచని పరిస్థిలో ఉన్నారని, అలాగే బొప్పాయి, అరటి తోటలకు సుమారు ఎకరానికి 80 వేలు పైన పెట్టుబడి పెట్టారన్నారు. బొప్పాయి, అరటి తోటలు దిగుబడి వచ్చే సమయంలో గాలులు రావటం వలన రైతులు చాలా నష్టపోయారని, రైతులు అప్పులు తీసుకువచ్చి పెట్టుబడి పెట్టారని, ఇప్పుడు అప్పులు ఎలా తీర్చాలో అర్ధంకాక దిక్కుతోచని పరిస్థిలో రైతులు కన్నీరు కారుస్తున్నారన్నారు. రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.