ఏపీ సర్కార్ మరో సంక్షేమ పథకాన్ని అమలు చేసింది. మత్స్యకారులకు భృతి అందించేందుకు వరసగా నాలుగో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ శుక్రవారం అమలు చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ మత్స్యకారుల ఖాతాల్లో రూ.10వేలు చొప్పున జమ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్ళే 1,08,755 మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున దాదాపు రూ.109 కోట్ల ఆర్ధిక సాయాన్ని ఏపీ సర్కార్ అందించింది. దీంతో మత్య్సకార కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి.