ప్రపంచ దేశాల్లో కరోనా విలయతాండవం చేసిన రోజుల్లో కూడా ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించింది. మరి అలాంటి దేశంలో ఇప్పుడు కరోనా మరణం కేసు నమోదైంది. తాజాగా ఓ కరోనా కేసు ఆ దేశంలో నమోదవడంతో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ లాక్ డౌన్ విధించాడు.
అయినప్పటికీ ఉత్తర కొరియాలో జ్వరం బాధితుల సంఖ్య ఎక్కువవుతోంది. జ్వరం కారణంగా గురువారం ఆరుగురు చనిపోయారు. అందులో ఒకరికి కరోనా అని నిర్దారించారు. చనిపోయిన ఆ వ్యక్తికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు వైద్యలు తేల్చారు. తాజాగా మరో 21 మంది జర్వంతోనే చనిపోయారు. దీంతో వీరు కరోనాతో చనిపోయారా? లేక జ్వరం కారణంగానే చనిపోయారా అనే విషయాన్ని ఆ దేశం మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు ఉత్తర కొరియా మీడియా తెలిపింది.