వేసవి కాలం తేలికైన కాలమేం కాదు, ఎండలతో పాటూ ఎన్నో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్దీ డైట్ తీసుకోవడం, తగినంత నీరు తీసుకుంటూ ఉండడంతో పాటు మీరు మీ స్కిన్ గురించీ, హెయిర్ గురించి కూడా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. సమ్మర్ లో మీ స్కిన్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.
1. మీ ఫేస్ వాష్ ని సమ్మర్ కి అనుకూలంగా మార్చుకోండి. ఎందుకంటే, ఈ సమయంలో మీ స్కిన్ ఎక్కువ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, దానికి తగినట్లుగా మీ ఫేస్ వాష్ ఉండాలి.
2. మీరు తీసుకునే సీరమ్స్, మాయిశ్చరైజర్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉండేలా చూసుకోండి.
3. మీ డైట్ లో తాజా పండ్లూ, కూరగాయలూ తీసుకోండి. ఈ సీజన్ లో లభిచే వాటిని తినడం ఎంతో మేలు చేస్తుంది.
4. తగినంత నీరు తాగండి. మీరు బయటకి వెళ్ళవలసి వస్తే మీతో పాటూ ఒక వాటర్ బాటిల్ నిండుగా నీరు తీసుకుని వెళ్ళండి.
5. ఎంత తక్కువ మేకప్ యూజ్ చేయగలిగితే అంత మంచిది. మీకు ఫౌండేషన్ తప్పని సరి అయితే ఎస్‌పీఎఫ్ ఉన్న టింటెడ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి.
6. ఎక్స్ఫోలియేషన్ మరిచిపోకండి. హోమ్ మేడ్ స్క్రబ్స్ కూడా యూజ్ చేయవచ్చు.
7. సమ్మర్ లో టోనర్స్ పోర్స్ కనపడకుండా చూస్తాయి. టోనర్ అప్లై చేస్తున్నప్పుడు మీ టీ జోన్ మీద శ్రద్ధ పెట్టండి.
8. హెవీ మాయిశ్చరైజర్స్ బదులు లైట్ మాయిశ్చరైజర్స్ తీసుకోండి.
9. సమ్మర్ లో శాండల్స్ వేసుకుంటారు కాబట్టి పెడిక్యూర్ కంపల్సరీ.
10. ఇంత ఎండలో జిమ్ లో వర్కౌట్ చేయలేమనుకుంటే వాకింగ్ చేయండి, లేదా జుంబా ట్రై చేయండి. ఏం చేసినా సరే మీ ఎక్సర్‌సైజ్ మాత్రం స్కిప్ చేయకండి.
11. విశ్రాంతి అవసరం, సమ్మర్ వేడిలో ఇంకా అవసరం. అందుకే, మీ షెడ్యూల్స్ ఎలా ఉన్న సరే, మీ రెస్టింగ్ టైమ్ మాత్రం మారకూడదు.
12. ఎండలో బయటకి వెళ్ళవలసి వస్తే సన్ గ్లాసెస్ యూజ్ చేయండి.
13. చల్లని నీటితో స్నానం చేయండి.
14. ఫేస్ మిస్ట్ మీకు ఎండ వేడిమి నుండి తక్షణం రిలీఫ్ ని ఇస్తుంది.