ఇప్పటి వరకూ ఎండలు దుమ్మురేపాయి. తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారీ ఎండలకు ప్రజలు అల్లాడిపోయారు. ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. మరో 24 గంటల్లో భారత్ లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలియజేసింది.
అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు వచ్చి ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ నెల చివరిలోగా కేరళను ఈ రుతుపవనాలు తాకే అవకాశం ఉందని వారు తెలిపారు. జూన్ 8వ తేదీలోగా తెలంగాణలోకి ఈ నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.