కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి చిందంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సెంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నది. కార్తీ చిదంబరం నివాసాలతో పాటు దేశవ్యాప్తంగా కార్యాయాలయాల్లో సోదాలు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కార్తీ చిదరంబరంపై నమోదైన కేసుల్లో భాగంగానే ఢిల్లీ, ముంబై, చెన్నై, కర్నాటక, ఒడిశా తొమ్మిది ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తున్నది. 2010-2014 మధ్యకాలంలో కార్తీ చిదంబరం విదేశాలకు నగదు తరలించారని ఆరోపణలున్నాయి.ఇటీవల కార్తీ చిదరంబరం సీబీఐ చైనీస్ వీసా అంశంపై కేసును సైతం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే, సీబీఐ దాడులపై కార్తీ చిదంబరం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇంకా ఎన్నిసార్లు సోదాలు చేస్తారు? ఇప్పటికీ ఎన్నిసార్లు ఇలా జరిగింది.. తప్పనిసరిగా రికార్డుండాలి’ అంటూ ట్వీట్ చేశారు. అయితే, ఇందులో సీబీఐ పేరును మాత్రం ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం.