మండవల్లి గ్రంథాలయంలోని వేసవి విజ్ఞాన శిబిరం మంగళవారం ప్రారంభించడం జరిగిందని గ్రంథాలయ అధికారిణి షేక్ పర్వీన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో వేసవిలో విద్యార్థులకు 45 రోజులు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు వేసవి విరామ సమయంలో ఈ శిబిరంకు హాజరై సద్వినియోగం చేసుకొని సృజనాత్మకతను పెంపొందించుకోవాలని కోరారు.
మొదటిరోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో లెక్కలు టీచరు బి. కరుణకుమారి మ్యాజిక్ స్కేర్ (మాయా చతురస్రం) గూర్చి విద్యార్థులకు వివరించి సాధన చేయించారు. ఈ సమ్మర్ క్యాంప్ ఆవశ్యకత గురించి వివరించి, బాలల బొమ్మల నీతి కథలు విద్యార్థులతో చదివించటం జరిగిందన్నారు మంగళవారం నుండి జూన్ 30వ తేదీ వరకు జరిగే వేసవి శిబిరానికి విద్యార్థులంతా హాజరుకావాలని ఆమె కోరారు.
ప్రతిరోజు ఉపాధ్యాయులు, పలువురు ప్రముఖులతో కథలు, కథనాలు, సృజనాత్మక కృత్యాలు నిర్వహించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సమ్మర్ క్యాంపు లో తాగునీటి వసతి తో పాటు విద్యార్థులకు కొద్దిపాటి తినుబండారాలను కూడా పంపిణీ చేశామాన్నారు.