రాత్రిపూట సరిగా నిద్ర పట్టడం లేదా...? అయితే చక్కగా ఉన్ని పైజామా వేసుకుని పడుకోండి. చక్కగా నిద్రపోతారు. ఇది ఉత్తినే చెప్పే మాటకాదు. పరిశోధకులు ప్రత్యేక అధ్యయయాన్ని నిర్వహించి మరీ ఉన్ని పైజామా చక్కటి నిద్ర పట్టేలా చేస్తుందని కనుగొన్నారు. సాధారణంగా కాటన్ దుస్తులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. అయితే పత్తి కంటే ఉన్ని మన శరీరానికి మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన మిరిమ్షిన్ ఒక ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో ఉన్ని పైజామా ధరించడం వల్ల గాఢ నిద్రకు చాలా సహాయకారిగా ఉంటుందని తేలింది.
పడకకు సంబంధించి ఉపయోగించే వాటిలో కూడా ఉన్ని వస్త్రాలు చాలా మెత్తగా ఉంటూ త్వరగా నిద్ర పట్టేలా చేస్తాయని చెబుతున్నారు. పత్తి కంటే ఉన్నిలో ఎక్కువ శోషణ లక్షణాలు ఉన్నాయని, ఎక్కువసేపు నిద్రపోవడానికి 22 డిగ్రీల సెల్సియస్ కంటే 17 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని, త్వరగా నిద్రపోవడంలో ఈ ఉష్ణోగ్రత ప్రభావం ఉన్నిపై కూడా ఉంటుందని చెబుతున్నారు.