ప్రపంచంలోనే నంబర్ వన్ ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదన ఇంధన ప్రాజెక్టును మన జిల్లాకు ఇచ్చినందుకు పాణ్యం నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు . ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ ప్రాజెక్టు నిర్మించేందుకు ముందుకు వచ్చిన గ్రీన్‌కో యాజమన్యాన్ని అభినందిస్తున్నాను. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో టీడీపీ నాయకులు ఈ ప్రాజెక్టు విషయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వలేకపోయింది. మా నాయకుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రైతులందరికీ పరిహారం ఇచ్చారు. ఏ రైతు కూడా ధర్నాలు చేయలేదు. కార్యాలయాల చుట్టూ తిరగలేదు. ఇంతగా ఆదుకున్న సీఎం వైయస్ జగన్‌కు రైతుల తరఫున ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.