మిడుతూరు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని పాలపళ్ల సైజు బండలాగుడు పోటీలను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో పలు గ్రామాలకు చెందిన వృషభరాజములు హోరాహోరీగా తలపడ్డాయి. గెలుపొందిన వృషభ రాజముల యజమానులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన పొట్టిళ్లు పందాలు భక్తులను ఆకర్షించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa