వేసవి ఎండలతో పాటు భారతదేశంలో పెట్రో మంటలు మండుతున్నాయి. గత కొద్ది రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా, జపాన్, బ్రెజిల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాల కంటే భారత్‌లో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా పరిశోధనలో తేలింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తక్కువగా ఉండగా, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనామిక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా 106 దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరల ఆధారంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ నివేదికను రూపొందించింది. తలసరి ఆదాయం విషయానికొస్తే, వియత్నాం, కెన్యా, ఉక్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక మరియు వెనిజులా కంటే భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్న దేశాల్లో తలసరి ఆదాయం కూడా ఎక్కువ కానీ భారత్‌లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది.