సకాలంలో పంట రుణాలు చెల్లించి రాయితీ పొందాలని ఆస్పరి ఏపీజీబీ మేనేజర్ అమర్ సింగ్ రైతులకు సూచించారు. బుధవారం ఆస్పరిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఖరీఫ్, రబీ సీజన్లలో తీసుకున్న రుణాలను సంవత్సరం కాకముందే చెల్లిస్తే 3 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సంవత్సరం జూన్ నెలాఖరు వరకు మాత్రమే పంట రుణం సంబంధించి వడ్డీ మాత్రమే కట్టించుకుంటామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa