జిల్లా పరిషత్ సమావేశపు మందిరము నందు జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశం జరుగునని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు. 1431 ఖరీఫ్ రెండవ పంట సాగుకు గాను చెరువుల నుండి సాగునీటి సరఫరా, నీటిపారుదలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి ఉష చరణ్ అధ్యక్షతన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె నారాయణ స్వామి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, విద్యుత్, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మాత్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర పర్యాటక యువజన శాఖ మాత్యులు ఆర్. కె. రోజా లతో కలసి సమీక్ష సమావేశం జరుగునని ఈ సమావేశానికి జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, గ. జెడ్‌పి ఛైర్మన్, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, సంబంధింత శాఖల అధికారులు పాల్గొంటారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.