దేశ రాజధానిలో గత 24 గంటల్లో 520 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, కేసు పాజిటివిటీ రేటు 2.09 శాతంగా ఉందని ఢిల్లీ ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. దీంతో నగరంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,377కి చేరింది. హెల్త్ బులెటిన్ ప్రకారం, ఈ కాలంలో 817 మంది కోవిడ్ రోగులు కోలుకున్నారు, మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి మొత్తం రికవరీల సంఖ్య 18,73,604కి చేరుకుంది.నగరంలో మరణాల సంఖ్య 26199కి పెరిగింది.గత 24 గంటల్లో 24,918 కోవిడ్ పరీక్షలు జరిగాయి అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa