ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియంలో శుక్రవారం మంకీపాక్స్ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులు ఇప్పటికే యూరోపియన్ దేశాలైన స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్, స్వీడన్ మరియు కెనడాతో పాటు ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ మరియు కొన్ని ఆఫ్రికన్ దేశాలకు వ్యాపించాయి. 29 ఏళ్ల వ్యక్తి మంకీపాక్స్‌తో బాధపడుతున్నట్లు ఫ్రెంచ్ అధికారులు తెలిపారు. తమ దేశంలో రెండు కేసులు ఉన్నట్లు బెల్జియం నిపుణులు వెల్లడించారు. స్పెయిన్‌లో ఇవాళ 14 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరుకుంది.ఫ్రెంచ్ మంకీపాక్స్ రోగి ఫ్రాన్స్‌లోని ఇలే-డి-ఫ్రాన్స్ ప్రాంతానికి చెందినవాడు. అయితే, అతను వైరస్ వ్యాప్తి చెందిన దేశాలకు వెళ్లలేదని ఫ్రెంచ్ ఆరోగ్య అధికారులు శుక్రవారం తెలిపారు.స్పెయిన్‌లో ఇప్పటికే 21 కేసులు ఉండగా, మరో 20 అనుమానిత కేసులు ఉన్నాయి.