చైనా దాడిచేస్తే మాత్రం తైవాన్ కు తాము అండగా నిలుస్తామని అమెరికా దేశాధినేత జ బైడెన్ అన్నారు. ఇదిలావుంటే ఇదిలావుంటే తైవాన్ విషయంలో గతేడాది అక్టోబరులోనూ బైడెన్ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. అమెరికా విధానంలో ఎటువంటి మార్పులు ఉండబోవని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇండో-పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్‌వర్క్ ప్రారంభంలో తైవాన్ గురించి బైడెన్ వ్యాఖ్యల కారణంగా ఆసియాలో అమెరికా ఆర్థిక సాయం అందించే విస్తృత ప్రణాళిక మరుగున పడే అవకాశం ఉంది.
చైనా దాడి చేస్తే తైవాన్‌కు తాము రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆసియాలో అడుగుపెట్టిన జో బైడెన్.. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. తైవాన్‌ను తన భూభాగంగా పరిగణిస్తోన్న చైనా.. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు ఇటీవల ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో తైవాన్‌పై చైనా దండయాత్రకు దిగితే అమెరికా వైఖరేంటని మీడియా అడిగిన ప్రశ్నకు బైడెన్ పై విధంగా సమాధానం ఇచ్చారు. తైవాన్‌పై దాడిచేస్తే సాయంగా వెళ్తారా? అని ప్రశ్నించగా.. అవునని బైడెన్ సమాధానం ఇచ్చారు.
‘‘వన్ చైనా పాలసీని మేం అంగీకరిస్తాం.. మా నిబద్ధత అదే.. దానికి ఉద్దేశించిన అన్ని ఒప్పందాలపై మేము సంతకం చేశాం.. కానీ, అది బలవంతంగా తీసుకొచ్చారు.. ఆ ఆలోచన సరైంది కాదు’’ అని అన్నారు. అయితే, అలాంటి సంఘటన జరగకూడదని తాము కోరుకుంటున్నామని తెలిపారు. తైవాన్ తనను తాను రక్షించుకునే మార్గాలను అమెరికా అందించడానికి చట్టం అవసరం. ఒకవేళ చైనా దాడి చేస్తే తైవాన్‌ను రక్షించడానికి సైనికంగా జోక్యం చేసుకుంటుందా? అనే దానిపై చాలా కాలం నుంచి అగ్రరాజ్యం అస్పష్ట విధానాన్ని అనుసరిస్తోంది.
తాజా పర్యటనలో క్వాడ్ కూటమిలోని జపాన్, భారత్, ఆస్ట్రేలియా నాయకులతో కూడా బైడెన్ భేటీ కానున్నారు. పెరుగుతున్న చైనా శక్తి సామర్థ్యాలు, అది తైవాన్‌పై దాడి చేయగల అవకాశం గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తమ సైనిక సంబంధాలను బలోపేతం చేయడంపై బైడెన్‌తో చర్చించినున్నట్టు జపాన్ ప్రధాని కిషిడా వ్యాఖ్యానించారు. ‘‘బలమైన జపాన్.. అమెరికా-జపాన్ శక్తివంతమైన కూటమి ఈ ప్రాంతానికి చాలా కీలమైంది’’ అని తెలిపారు.
మరోవైపు, తైవాన్ స్వాతంత్య్రానికి మద్దతునిచ్చే ప్రయత్నాలకు “భారీ మూల్యం” చెల్లించుకోక తప్పదని అమెరికాను చైనా కొద్ది రోజుల కిందట హెచ్చరించింది. అమెరికా రక్షణశాఖకు చెందిన మాజీ అధికారుల ప్రతినిధి బృందం ఇటీవల తైవాన్‌లో అడుగుపెట్టింది. తైవాన్ స్వతంత్ర దేశంగా అమెరికా మద్దతు ఇవ్వడంపై కూడా చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తమ అంతర్గత వ్యవహారమని అంటోంది.