ప్రయాణికులను మోసం చేసే మాయగాడిని తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాళహస్తి బస్సులు నిలిచే ప్రాంతంలో బ్రహ్మయ్య అనే వ్యక్తి ప్రయాణికులకు మోసపు మాటలు చెప్పి నగదు వసూళ్లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనాథ ఆశ్రమ ప్రచారకర్తగా గుర్తింపు కార్డు సృష్టించుకుని. నగదు వసూళ్లు చేశాడు. ఈ క్రమంలో అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి అపరాధ రుసుం విధించారు.