మండల గ్రామాల్లోని రైతులు నీటి తీరువా బకాయిలు త్వరితగతిన చెల్లించాలని బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, అమృతలూరు మండల తహసీల్దార్ ఎం. స్వర్ణలత కోరారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ అమృతలూరు మండల పరిధిలోని 13 రెవెన్యూ గ్రామాలలో 14, 591 మంది ఖాతాదారులు ఉన్నారని, ఆ క్రమంలో నీటి తీరువా 84. 20 లక్షలు చెల్లించాల్సి ఉండగా, ప్రస్తుతం 11. 87 లక్షలు నీటి తీరువా వసూలు చేసినట్లు వివరించారు.
ఇంకా 72. 32 లక్షలు బకాయి వసూలు చేయాల్సి ఉందన్నారు. గతంలో రెవెన్యూ సిబ్బంది నీటి తీరుగా మాన్యువల్ గా వసూలు చేసేవారని ప్రస్తుతం ప్రభుత్వం ఆన్లైన్ పద్ధతి ప్రకారం రైతులు చెల్లించే సౌకర్యం ఏర్పాటు చేసిందన్నారు. రైతులు స్థానికేతరంగా ఉంటున్నా వారు అక్కడ వార్డు, గ్రామ సచివాలయంలో ఆన్ లైన్ ద్వారా కూడా చెల్లించినా వారి ఖాతాల్లో చెల్లింపులు జమ అవుతాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.