కావలసిన పదార్థాలు: పుదీనా ఆకులూ - కొన్ని, బ్లాక్ సాల్ట్ - చిటికెడు, ఐస్ క్యూబ్స్ - 4, జల్జీరా పౌడర్ - అర స్పూన్, నిమ్మకాయ - 1, థమ్స్ అప్ డ్రింక్ బాటిల్ -1.
తయారీవిధానం: కొన్ని పుదీనా ఆకులను తీసుకుని చేతితో బాగా నలిపి ఒక గ్లాసులో వేసుకోవాలి. అందులో చిటికెడు బ్లాక్ సాల్ట్, అర స్పూన్ జల్జీరా పౌడర్, నిమ్మకాయ రసాన్ని, ఐస్ క్యూబ్స్ ను వెయ్యాలి. ఇప్పుడు ఆ గ్లాసులో ఛిల్డ్ థమ్స్ అప్ డ్రింక్ ను సగానికి పోసుకోండి. ఒక స్పూను తీసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ థమ్స్ అప్ ను గ్లాసు నిండే వరకు పోసుకోవాలి. అంతే... వెరైటీ టేస్ట్ గల థమ్స్ అప్ రెడీ. ఇంటికి బంధువులెవరైనా వచ్చినప్పుడు ఈ పానీయాన్ని వారికి అందించండి. నిజంగా చాలా థ్రిల్ అవుతారు. ఈ రెసిపీ లో ముఖ్యమైన పదార్ధం ఏంటంటే, జల్జీరా పౌడర్. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని మిస్ చెయ్యకూడదు. బయట మార్కెట్లో జల్జీరా పౌడర్ దొరుకుతుంది. ఈ రెసిపీకి టేస్ట్ ను ఇచ్చేది జల్జీరా పౌడరే.