పాదాల పగుళ్ల సమస్య ఎక్కువగా ఆడవారిలో వస్తుంటుంది. ఈ సమస్య తీవ్రనొప్పిని కలిగించటమే కాక, పాదాలను అందవిహీనంగా చేస్తుంటాయి. పాదాలను సరిగ్గా శుభ్రపరచక పోవడం వల్ల మలినాలు, మట్టి చేరి అక్కడి చర్మం గట్టి పడి పగుళ్లు ఏర్పడతాయి. పాదాల పగుళ్లను తగ్గించడానికి రకరకాల క్రీములను, ఆయింట్ మెంట్లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల పగుళ్లు తగ్గినా శాశ్వత పరిష్కారం లభించదు. ఇంట్లోనే సహజ సిద్దమైన పద్దతిలో మనం పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దామా..
పాదాల పగుళ్ల తో ఇబ్బంది పడేవారు వీలైనంత వరకు చెప్పులను ధరించే ఉండాలి. పాదాలకు ఆముదం లేదా నెయ్యిని రాసి వేడి నీటిలో 25 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత గరుకుగా ఉండే వస్త్రాన్ని ఉపయోగించి పాదాలను శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మూడు నుంచి వారం రోజులలో పాదాల పగుళ్లు తగ్గుతాయి. దీంతో పాటు స్నానం చేసేటపుడు టైం వేస్ట్ అనుకోకుండా పాదాలను శుభ్రపరచటానికి కొద్ధి సమయాన్ని కేటాయించాలి.