గుజరాత్ లోని వడోదరాకు చెందిన నికుంజ్ త్రివేది అనే యువ ఇంజినీర్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. కరేలిబాగ్ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నివసించే చిన్నారులకు వీధి లైట్ల కింద చదువు చెబుతున్నాడు. రోజూ జాబ్ కి వెళ్లి వచ్చి సాయంత్రం పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాడు. అతని వద్ద ప్రస్తుతం 90 మంది వరకు చదువుకుంటున్నారు. త్రివేది తన ఆదాయంలో 25 శాతం సంపాదనను విద్యార్థుల కోసం వినియోగిస్తున్నాడు.